- Advertisement -
పాట్నా: చైనాలోని షాన్డాంగ్ ప్రాంతానికి చెందిన లీ జియాఖీ(63) ముజఫ్ఫర్ పూర్ లోని అమర్ షహీద్ ఖుదీరామ్ బోస్ సెంట్రల్ జైల్ లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అతడు టాయిలెట్ లో స్పృహతప్పి పడిపోయి ఉండడంతో అతడిని జైలు అధికారులు శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అతడు విరిగిన తన కంటి అద్దాలతో లైంగిక అంగాన్ని కోసుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కానీ పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది.
లీ జియాఖీని జూన్ 6న లక్ష్మీ చౌక్ వద్ద అరెస్టు చేశారు. అతడి వద్ద ఇండియన్ వీసా లేనందుకు అరెస్టు చేశారు. అతడిని అరెస్టు చేసినప్పుడు చైనా పటం, మూడు రాతి ప్రతిమలు, చైనా-నేపాల్-ఇండియాకు చెందిన కరెన్సీలు అతడి వద్ద దొరికాయి. విదేశీయుల చట్టం 1946 కింద ఉన్న సెక్షన్ల ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు.
- Advertisement -