Monday, December 23, 2024

తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని -తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం బేగంపేటలో ని హోటల్ హరిత ప్లాజాలో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మూడవ సౌతిండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వివాహ వేడుకలకు గమ్యస్థానంగా ఉన్నప్పటికీ హైదరాబాద్, దాని చుట్టుపక్కలా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటగర్లు, రిసార్టుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. హైదరాబాద్‌కు అవతల ఎన్నో సుందరమైన ప్రదేశాలు, పుష్కలమైన వనరులు ఉన్నాయని, చారిత్రక ప్రాముఖ్యత, పచ్చని కొండల నడుమ ఉన్న సాగర తీరం డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అనువైన ప్రాంతమని, అలాగే కృష్ణా నదీ తీరాన కొల్లపూర్‌లోని సోమశిల బ్యాక్‌బాటర్ కూడా అద్భుతమైన కేంద్రమని, ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను క ల్పించాల్సిన అవసరముందని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలన్న లక్షంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మెడికల్, ఎకో టూరిజం, అడ్వెంచర్, స్పిరిచువల్ టూరిజం సహా వివిధ టూరిజం రంగాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటక శాఖ అభివృద్ధితో ఆదాయం పెరగడంతో పాటు యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా, పర్యాటక రంగానికి ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండా రమేష్ నాయుడు, పర్యాటక శాఖ డైరెక్టర్ కె. నిఖిల, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, హైటెక్స్ హెడ్ శ్రీకాంత్, శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ కన్వీనరఃవ రామ్ కె ముప్పన, టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ కో కన్వీనర్లు హిరీష్ రెడ్డి, కుమార్ రాజా, డాక్టర్ సౌరభ్ సురేఖ, సుధాకర్ యకరబడి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News