Tuesday, November 5, 2024

ధాన్యం కొనుగోళ్లలో రికార్డ్

- Advertisement -
- Advertisement -

tమన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ.10, 355.18 కోట్లు చెల్లింపులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. గతంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈసారి మాత్రం దాదాపు రెండు వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది.

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా ష్ట్రవ్యాప్తంగా ఈసారి 7,178 ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రభుత్వం తెరిచింది. వీటిలో 6,345 కేం ద్రా ల్లో కొనుగోళ్లలో లావాదేవీలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అధికారులు వెనుకాడలేదు. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, న ల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల, సూ ర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మం చిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.

నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలు
ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తందని, మరో పది రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని సివిల సప్లయి విభాగం అంచనా వేస్తోంది. పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేం ద్రాలు తెరిచి ఉంచాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ ట న్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లయ్ వి భాగం మొదట్లో అంచనా వేసింది. కానీ, మార్కెట్‌లో మ ద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయటంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా తగ్గింది. ధా న్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఈసారి సివిల్ స ప్లయ్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అందులో భా గంగా ఈదురు గాలులు, అకాల వర్షాలకు కూడా రైతు లు నష్టపోకుండా ఈ శాఖ తగిన జాగ్రత్తలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News