Friday, December 20, 2024

కెనడాలో భారతీయుడి హత్య

- Advertisement -
- Advertisement -

కెనడాలో నివసిస్తున్న ఇండియన్ యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 7న ఈ సంఘటన జరిగినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పంజాబ్ లోని లుథియానాకు చెందిన యువరాజ్ ఉన్నత చదువులు కోసం 2019 లో కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ నేపథ్యం లోనే శుక్రవారం బ్రిటిష్ కొలంబియా లోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు పోలీస్‌లకు సమాచారం అందింది. యువరాజ్ మృతదేహాన్ని పోలీస్‌లు గుర్తించి నలుగురు అనుమానితులను అదుపు లోకి తీసుకున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని గుర్తించారు. అయితే హత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News