Saturday, January 18, 2025

కొత్త కుట్రలకు తెర లేపుతున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

అల్లుడు హరీష్‌ను బిజెపిలోకి పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు కెసిఆర్ తెర లేపుతున్నారని టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి..నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారని అన్నారు. బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్థుల కోసం అల్లుడు హరీష్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ గమనిస్తోందన్నారు.

పదేళ్లలో దేశానికి మోడీ ఏం చేశారు : టిపిసిసి ఇంటలెక్చువల్ సెల్ ఛైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్

పదేళ్లలో దేశానికి మోడీ ఏం చేశారని టిపిసిసి ఇంటలెక్చువల్ సెల్ ఛైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూశాయని, అందుకే సీట్లు తగ్గాయన్నారు. ఇండియా కూటమికి వంద సీట్లు కూడా రావని సర్వేలు చెప్పాయని, కానీ ప్రజలు 230 సీట్లలో గెలిపించారన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర వల్ల ఇన్ని సీట్లు సాధ్యమయ్యాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News