Friday, December 20, 2024

రేపు సిఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. చిరంజీవికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు ఎన్డీఏ సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం కూటమి నేతలు అచ్చెన్న, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్‌ గవర్నర్ ను కలిశారు. ఎన్డీఏ పక్ష నేత గా చంద్రబాబును ఎన్నుకున్నామని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు లేఖ అందించారు. కాగా, డిప్యూటీ సీఎంగా రేపు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేపు జరగనున్న సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రదాని మోదీ, అమిత్ షాలతోపాటు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు
14 ఎకరాల్లో సభా ప్రాంగణం 65 వేల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News