Sunday, December 22, 2024

మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బ్లాంటైర్: ఆఫ్రికా దేశంలోని మాలవీలో విమానం అదృశ్యమైన విమానం చివరికి పర్వత ప్రాంతంలో కూలిపోయింది. ఆ దుర్ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు. గల్లంతై విమాన శకలాలను గుర్తించామని, ఎవరూ బతికి బయటపడలేదని ఆయన వివరించారు.

మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందితో ప్రయాణించిన సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలు దేరిన ఆ విమానం 370 కిమీ. దూరంలో ఉన్న జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉండింది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ విమానం అదృశ్యమైంది. రాడార్ తో విమాన సంబంధాలు తెగిపోయాయి.

ఎంత ప్రయత్నించినా, గాలింపులు చర్యలు చేపట్టినా దాని జాడ దొరకలేదు. అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, నార్వే వంటి దేశాలు సైతం సాయం అందించేందుకు ముందుకు వచ్చాయని మలావీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే కూలిన విమానం శకలాలు గుర్తించారు.

Malawi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News