Friday, December 20, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) మంగళవారం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తీన్మార్ మల్లన్న పుష్పగుచ్చం అందజేశారు. కాగా, ఇటీవల నిర్వహించిన వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News