Saturday, October 5, 2024

నేడు గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్‌సి) గురువారం(జూన్ 13) విడుదల చేయనుంది. ప్రాథమిక కీ తో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను గురువారం టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది. ఈ ఒఎంఆర్ షీట్లు ఈనెల 13 నుంచి 17 వరకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది. గ్రూప్ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ పై గురువారం నుంచి ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అభ్యంతరాలు తెలపాలని కమిషన్ చెప్పింది. ప్రాథమిక కీ పై ఈమెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని టిజిపిఎస్‌సి స్పష్టం చేసింది. అలాగే గడువు ముగిసిన తర్వాత సమర్పించే అభ్యంతరాలను పరిగణించమని తెలిపింది.
మెయిన్స్‌కు 28,150 మంది
అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది కీ విడుదల చేయనున్నది. తుది కీ ఖరారైన తర్వాత వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 9వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో 31 జిల్లాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిజిపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయగా, 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 మంది పరీక్షకు హాజరయ్యారు. 563 పోస్టులకు 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మల్టీజోన్, రిజర్వేషన్లను బట్టి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ ఖరారు
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. జనరల్ ఇంగ్లీష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థి తాను మీడియం ఎంపిక చేసుకున్న అదే మీడియంలో మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)
అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్)
అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)
అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News