Sunday, November 24, 2024

ఎవరినీ వదలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :కాళేశ్వరం ఎత్తిపోతల సా గునీటి పథకంలో తప్పిదాలకు కారణమైన బాద్యులను వదలమని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.సి.ఘోష్ హెచ్చరించారు. బ్యారేజీల నిర్మాణం, వాటి డిజైన్లకు సంబంధించిన వివవరాలన్నింటినీ సేకరిస్తున్నామన్నారు.బుధవారం జస్టిస్ ఘో స్ మీడియాతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో జరిగిందేమి టో తెలుసుకునేందుకే అఫిడవిట్లు సమర్పించాలని చెప్పామన్నారు. బ్యారేజీలను నిర్మించిన కాంటాక్టు సంస్థల ప్రతినిధులతో మాట్లాడమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం అదేశించిందని, గడువలోగా పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టి వత్తడి చేసిందని , ఆ విధమైన ఆదేశాలతో ప్రభుత్వ వత్తిడి మేరకే ప నిచేశామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు, కాళేశ్వరంపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై, వా రిని అడిగినట్లు జస్టిస్ ఘోష్ వివరించారు.

నిర్మాణ సం స్థల ప్రతినిధులను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినట్లు తెలిపారు. తప్పుడు అఫిడవిట్, ఫైల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఎ వరు ఏ ది చెప్పినా పక్కాగా రికార్డు చేసి వాటిని భద్రంగా పదిల పరుస్తున్నట్టు తెలిపారు. తప్పుడు అఫిడవిట్లు దాఖ లు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామన్నారు. లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిం ది తదితర విషయాలను తేలుస్తామన్నారు.ఎవరి ఆదేశాలమేరకు పనులు జరిగాయన్న అంశాలను రికార్డు రూపం లో వచ్చా క వారిని కూడా పిలుస్తామన్నారు. విజిలెన్స్ , కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని,వారిని కూడా పిలిచి మరిన్ని వివరాలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే మూడు మేడిగడ్డ , అన్నారం ,సుందిళ్ల బ్యారేజిల నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజనీర్లను విచారించి , అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు వెల్లడించాలని ఆదేశించామన్నారు. జూన్ 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామని జస్టస్ ఘోష్ వెల్లడించారు.

ముమ్మరంగా విచారణ:
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ ముమ్మరంగా కొసాగుతోంది.
నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు బుధవారం నాడు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ విచారణలో ఆరా తీసింది. సంబంధిత వివరాలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News