Monday, December 23, 2024

రుణమాఫీకి కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్ట్ 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ నేపధ్యంలో రైతుల కు ఇచ్చిన హామీ ప్రకారం గడువులో గా రు ణమాఫీ చేసేందుకు సన్నాహాలు చే యాల ని ఇటీవలే రేవంత్‌రెడ్డి వ్యవసాయ శాఖ, ఆ ర్థికశాఖ అధికారులను ఆదేశించా రు. రు ణమాఫీపై చర్చించి విధివిధానాలు ఖ రారు చేసేందుకు వారంరోజుల్లో రాష్ట్ర మం త్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ము ఖ్యమంత్రి నిర్ణయించారు. రుణమాఫీ అ మలు చేసేందుకు అవసరమై న ప్రభుత్వ ప రమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చ ర్చించనున్నారు. ఈ దిశగా ప్రభుత్వం వనరుల సమీక్షరణపై దృష్టిపెట్టింది. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం.. దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోం ది.

మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి.. అసలైన అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్నవిధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు,

డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొపెషనల్స్ ను ఈ పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చిందనే చర్చ జరిగింది. అందుకే రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీతో చేయూతను అందించటం ద్వారా రైతుల చేతులను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి ధ్రుడ నిశ్చయంతో ఉన్నారు. అసలైన రైతులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతుల కుటుంబాలన్నీ ప్రభుత్వం అందించే లబ్ధిని అందుకునేలా మార్గదర్శకాలుండాలని ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత గడువులోగా పంట రుణాలు మాఫీ చేయటాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా ఈ పథకం అమలు చేసి తీరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకే రైతు రుణమాఫీ పథకం అమలు దిశగా ప్రభుత్వం వేగంగా కార్యాచరణ మొదలు పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News