Saturday, November 16, 2024

తెలంగాణలో గొర్రెల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడి ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఏ) కింద విచారణ చేపట్టనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖకు ఈడి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడి అధికారులను ఆదేశించింది.

తెలంగాణలో గొర్రెల కొనుగోలులో రూ. 700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసిబి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడి దృష్టి సారించింది. మనీలాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు చేయనున్నది. జిల్లాలవారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామా, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతల వివరాలు వంటి సమాచారం ఇవ్వాలని ఈడి కోరనున్నది.  అదే క్రమంలో గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, చెల్లింపు వివరాలు, గొర్రెల దాణా, దానిని ఎయే లబ్ధిదారులకు ఇచ్చారు అనే వివరాలు సేకరించనున్నారు. ఇంకా దీని కోసం ఎవరికి నిధులు ఇచ్చారనే అంశాన్ని కూడా ఈడి వివరాలు కోరనున్నది.

గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగిశాక వారిని ఏసిబి అధికారులు చంచల్ గూడ జైలుకు పంపించారు. ఏసిబి అధికారులకు వీరు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటి వరకు 10  మందిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్న పశుసంవర్ధక శాఖ సిఈవో రామ్ చందర్ నాయక్, మాజీ ఓఎస్ డి కళ్యాణ్ కుమార్ లను ఏసిబి అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News