Monday, December 23, 2024

ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శిగా పికె మిశ్రా

- Advertisement -
- Advertisement -

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ పున:నియామకం

న్యూ ఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌ను గురువారం మళ్లీ నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధన కార్యదర్శిగా పికె. మిశ్రాను కేబినెట్ నియామకాల కమిటీ మళ్లీ నియమించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ డాక్టర్ పికె. మిశ్రాను పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా, అజిత్ దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారుగా తిరిగి నియమించడంతో, ఈ ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లు ఎక్కువ కాలం ప్రధానమంత్రికి ప్రధాన సలహాదారులుగా పనిచేసిన రికార్డు పొందారు.

డాక్టర్ మిశ్రా ప్రధాని కార్యాలయంలో పరిపాలనా వ్యవహారాలు,నియామకాలను నిర్వహిస్తుండగా, దోవల్ జాతీయ భద్రత, సైనిక వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ ను నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News