Monday, November 25, 2024

ఇటలీకి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు.

ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే 50వ జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సదస్సు రేపు (జూన్ 14) జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోడీ, మెలోనీ చర్చించనున్నారు.

విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ, ఇది జీ7 అవుట్ రీచ్ దేశాలు తమ అభిప్రాయాలను , దృక్పథాన్ని పంచుకునే బ్లాక్ ఎజెండా ఐటెమ్ అన్నారు.

జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో జరగనున్న G7 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ , ఇజ్రాయెల్-హమాస్ వివాదం ప్రధానాంశం కానున్నది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News