మనతెలంగాణ/హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ’ మహిళాశక్తి క్యాంటీన్ సర్వీస్’లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.గురువారంరా ష్ట్రం లో క్యాంటీన్ సర్వీస్‌ల ఏర్పాటుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీల క అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాల న్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అ న్ని ప్ర ధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, ప ర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్‌స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాం తాల్లో మహిళా సం ఘాల నిర్వహణలో ప్ర త్యేకంగా క్యాంటీన్‌ల ను ఏ ర్పాటు చేయనున్నట్లు శాంతి కుమారి స్పష్టం చేశారు. ఇప్పటికే ’అన్న క్యాంటీన్’ల పేరుతో కేరళ, ఆంధ్రప్రదేశ్, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్‌లో నడుస్తున్న క్యాంటీన్‌ల పనితీరుపై అధ్యయం చేసినట్లు సిఎస్ వివరించారు.
రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్షంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్లు సిఎస్ శాంతి కుమారి వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణపై మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు. క్యాంటీన్‌ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు అవసరమైన విస్తీర్ణమైన స్థలం, ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరమైన ప్రణాళికలను రూపిందించాల్సిందిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్‌శాఖల కమిషనర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్యశాఖ కమిషనర్ కర్లన్, దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, పర్యాటకశాఖ డైరెక్టర్ నిఖిల, కార్పొరేషన్ ఎండి రమేష్ నాయుడు హాజరయ్యారు.