Monday, December 23, 2024

పోలీస్ వైఖరి కోరిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై తమ వైఖరిని కోరుతూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని జస్టిస్ అమిత్ శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ కేసును జులై 1న విచారణకు కోర్టు లిస్ట్ చేసింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం బిభవ్ కుమార్ జూన్ 12న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇలా జరిగింది.

ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బిభవ్ కుమార్‌కు జూన్ 7న ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అతనిపై ఆరోపణలు ‘తీవ్రమైనవి’ అని కోర్టు పేర్కొంది, పైగా అతను సాక్షులను ప్రభావితం చేయగలడనే భయం కూడా ఉందని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News