Friday, January 10, 2025

సిక్కింలో వర్షం.. విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

సిక్కిం ఉత్తర మంగాన్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షపాతం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా 15 మంది విదేశీయులతో సహా 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారి ఒకరు తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పర్యాటకులు అందరినీ విమానంలో తరలించడంపై కేంద్రంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం చర్చలు ప్రారంభించిందని సిక్కిం టూరిజం, పౌర విమానయాన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సిఎస్‌రావు తెలియజేశారు. భారీ వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి హిమాలయ రాష్ట్రం తీవ్రంగా దెబ్బ తిన్న తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ మింటోక్‌గాంగ్‌లో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

‘సమాచారంప్రకారం,భారీ వర్షపాతం, కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్డుపై అవరోధాలు ఏర్పడడంతో మంగాన్ జిల్లా లాచుంగ్‌లో సుమారు 1200 మంది దేశీయ పర్యాటకులు,15 మంది విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు’ అని రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ పర్యాటకులు అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని, తమ తమ ప్రదేశాలలోనే ఉండిపోవలసిందని, రిస్క్‌లు తీసుకోవద్దని వారికి స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారని రావు తెలిపారు. చిక్కుకుపోయిన పర్యాటకులు అందరికీ సరిపోయే ఆహార పదార్థాలు,రేషన్ల నిల్వలు ఉన్నాయని అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News