ట్రినిడాడ్: టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ సూపర్8కు అర్హత సాధించింది. గ్రూప్‌సిలో భాగంగా పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గాన్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్ నుంచి ఆతిథ్య వెస్టిండీస్ కూడా సూపర్8కు దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఓపెనర్ టోని (11), వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగా (27), అలీ నావో (13) మాత్రమే డబుల్ డిజిట్ మార్క్‌కు చేరారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూఖి మూడు, నవీనుల్ హక్ రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 101 పరుగులు చేసి విజయం సాధించింది. గుల్బదీన్ నైబ్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహ్మద్ నబి 16 (నాటౌట్) తనవంతు సహకారం అందించాడు.