Friday, January 10, 2025

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పులలో 8 మంది నక్సలైట్లు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్‌టిఎఫ్)కు చెందిన ఒక జవాను మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ఎస్‌టిఎఫ్ సిబ్బంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలి నుంచి నక్సలైట్లకు చెందిన భారీ స్థాయిలో ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగా నారాయణ్‌పూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బందితో కూడిన ఎస్టిఎఫ్ బృందం శనివారం ఉదయం అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా కాల్పుల పోరు జరిగినట్లు రాయపూర్‌లో ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దాదాపు గంటసేపు ఈ కాల్పుల పోరు సాగినట్లు ఆ అధికారి తెలిపారు.

కాల్పులు ఆగిపోయిన తర్వాత వెళ్లి చూసిన భద్రతా సిబ్బందికి నక్సల్స్‌కు చెందిన ఎనిమిది మృతదేహాలు లభించాయి. ఘటనా స్థలి నుంచి ఒక ఇన్సాన్ రైఫిల్, ఒక 303 రైఫిల్, ఒక బారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇతర ఆయుధాలు, మావోయిస్టు సంబంధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఒక ఎస్‌టిఎఫ్ జవాను మరణించగా మరో ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు ఆయన చెప్పారు. గాయపడిన జవాన్లను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. కాగాఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ డివిజన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 131 మంది నక్సలైట్లు మరణించారు. బస్తర్ డివిజన్‌లో కంకెర్, కొండగావ్, నారాయణ్‌పూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మ జిల్లాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News