Monday, December 23, 2024

త్వరలో మార్కెట్లోకి Infinix Note 40 5G

- Advertisement -
- Advertisement -

కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అదేంటంటే?..Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ జూన్ 21న భారతదేశ మార్కెట్లో లాంచ్ కానుంది. కాగా, కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో Infinix Note 40 Pro, Note 40 Pro+లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ Infinix Note 40 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో Infinix నుంచి రాబోయే ఈ కొత్త ఫోన్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇది 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 2160Hz PWM డిమ్మింగ్ కలిగి ఉండవచ్చు. అయితే, గతంలో విడుదల చేసిన Note 40 5Gని 6nm ప్రాసెస్ ఆధారంగా.. పనితీరు కోసం MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఉండబోతోంది.

ఫోన్‌లోని చిప్‌సెట్ IMG BXM-8-256 GPUతో జత చేయబడవచ్చు. హ్యాండ్‌సెట్ గరిష్టంగా 8GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.ఇక కెమెరా గురించి చెప్పాలంటే..సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇందులో 32MP సెన్సార్ ఉండవచ్చు. వెనుక కెమెరా సెటప్‌లో 108MP ప్రైమరీ సెన్సార్ అదేవిధంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో డ్యూయల్ 2MP సెన్సార్‌లు ఉండవచ్చు. ఈ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 5000 mAh కలిగి ఉంది. ఈ ఫోన్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News