Monday, November 25, 2024

వాహనదారులకు షాక్

- Advertisement -
- Advertisement -

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఈమేరకు పెట్రోలు ధరలు లీటరుకు రూ.3 వంతున డీజిల్ ధరలు రూ.3.5 వంతున పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమలు లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం కర్ణాటక సేల్స్ టాక్స్ పెట్రోలుపై 25.92 శాతం నుంచి 29.84 శాతం, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతం పెరిగింది. బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 99.84గా ఉండగా102.54 కి పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ. 85.93 వరకు ఉండగా 88.95 కి పెరిగింది. రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న అమ్మకం పన్నును రాష్ట్ర ప్రభుత్వం సవరించడంతో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం డీలర్ల సంఘం పేర్కొంది.

ఇంధన ధరల పెంపువల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 2500 కోట్ల నుంచి రూ. 2800 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరాశ పరిచాయి. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు అధికార కాంగ్రెస్ కేవలం 9 స్థానాలనే గెల్చుకుంది. ఇదిలా ఉండగా ఉచిత హామీల అమలు కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 37, 325 కోట్లను ఖర్చు చేసింది. ఈ ఏడాది రూ. 52, 009 కోట్లను ఖర్చుచేయాలని నిర్ణయించింది. నిధుల సేకరణకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మార్చి 14 నుంచి జూన్ 4 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా రెవెన్యూ వసూళ్లు చాలావరకు పడిపోయాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితిపై సమీక్షించిన తరువాత నిధులు భారీగా సేకరిస్తేనే కానీ అవసరాలు తీరవని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News