ఆసిఫ్‌నగర్‌లో హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ కుతూబుద్దిన్ అలియాస్ కుద్దూస్‌ను ఐదుగురు వ్యక్తులు కత్తులతో ఈ నెల 13వ తేదీన పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సయిద్ తాహెర్, సయిద్ ఇమ్రాన్, సయిద్ అమన్, సయిద్ ముజఫర్, షేక్ జావిద్‌ను అరెస్టు చేశారు. తాహెర్, ఇమ్రాన్, ముజఫర్ సొంత అన్నదమ్ములు కాగా, తాహెర్‌కు అమన్ బావమరిది అవుతాడు. నిందితులు కుతూబుదిన్‌కు మధ్య పాత గొడవలు ఉన్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న నిందితులు కతూబుద్దిన్ హత్య చేయాలని ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ రాత్రి 11.30 గంటలకు కుతూబుద్దిన్ వెంబడించడంతో తన సోదరుడు మహ్మద్ అబ్దుల్ రహీం పనిచేస్తున్న ఆసిఫ్‌నగర్‌కు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయినా విడవని నిందితులు కుతూబుద్దిన్‌ను కత్తులతో కడుపు, తల, మెడపై పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంలో పడి ఉన్న కుతూబుద్దిన్ స్థానికులు ఆలీవ్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.