Monday, December 23, 2024

జూబ్లీహిల్స్‌లో దగ్ధమైన బిఎండబ్లూ కారు

- Advertisement -
- Advertisement -

బిఎండబ్లూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దగ్దమైన సంఘటన జూబ్లీహిల్స్‌లో శనివారం చోటుచేసుకుంది. బిఎండబ్లూ కారు నందిగిరి హిల్స్ మెయిన్ రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న వారు బయటికి దిగారు. తర్వాత కారు పూర్తిగా దగ్ధమైంది. మెయిన్ రోడ్డుపై కారు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా కూడా సరైన సమయానికి అక్కడికి చేరుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంటలను ఆర్పేందుకు వచ్చే ఫైర్ ఇంజిన్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News