Monday, November 25, 2024

ఈవిఎంలనే కాదు..దేన్నయినా హ్యాక్ చేయొచ్చు: ఎలన్ మస్క్

- Advertisement -
- Advertisement -

ఈవిఎంలను మానవులు కానీ లేక కృతిమ మేధోపరంగా(AI) కానీ హ్యాకింగ్ చేయొచ్చని ఓ డిబేట్ లో ఎలన్ మస్క్ అనడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈవిఎంలను హ్యాకింగ్ చేయలేరని బిజెపి నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ అనడాన్ని ఎలన్ మస్క్ తోసిపుచ్చారు.

ప్యూర్టో రికో ఇటీవలి ప్రైమరీ ఎన్నికలలో ఈవిఎంల సమస్యలపై అమెరికన్ రాజకీయవేత్త , కుట్ర సిద్ధాంతకర్త రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ ఆందోళన వ్యక్తం చేయడంపై స్పందిస్తూ మస్క్ ‘X’ లో పోస్ట్ పెట్టారు.

“ భారతీయ ఈవిఎంలు సురక్షితమైనవి, ఏదైనా నెట్‌వర్క్ లేదా మీడియా నుండి వేరుచేయబడినవి. కనెక్టివిటీ , బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి వాటితో అనుసంధానం కానివి.  అంటే హ్యాకింగ్ చేయలేనివి’’ అని రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. అయితే చంద్రశేఖర్‌ అభిప్రాయంపై మస్క్ స్పందిస్తూ “ఏదైనా హ్యాక్ చేయవచ్చు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News