- Advertisement -
చేవెళ్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి డయాలసిస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గదిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతోపాటు దట్టంగా పొగ అలుముకోవడంతో భయాందోళనకు గురైన రోగులు బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు. మంటల్లో డయాలసిస్ కేంద్రంలోని మెడికల్ సామాగ్రి కాలిబూడిదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
- Advertisement -