Friday, November 22, 2024

ముఖ్య విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం : కెనడా ప్రధాని ట్రూడో

- Advertisement -
- Advertisement -

భారత్‌ కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇరు దేశాధినేతలు జీ7 సమావేశాల సందర్భంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. మన ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాం.

భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను మేం డీల్ చేస్తాం” అని ట్రూడో జీ7 చివరిరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం ప్రధాని మోడీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ కెనడా ప్రధాని ట్రూడోను జీ7 సదస్సులో కలిశాను ” అంటూ దానికి క్యాప్షన్ జత చేశారు. మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. మోడీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News