- Advertisement -
కోల్‌కతా : ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్లో సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీస్‌లు తెలిపారు. మృతురాలు కేరళకు చెందిన దేవికా పిళ్లై(21)గా సీనియర్ పోలీస్ అధికారి గుర్తించారు. హాస్టల్ భవనం సీలింగ్‌కు విద్యార్థిని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఖరగ్‌పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. బయోటెక్నాలజీ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్న పిళ్లూ సోమవారం ఉదయం సరోజినీ నాయుడు హాస్టల్ హాల్ పైకప్పుకు ఉరివేసుకుని కనిపించిందని, దానిపై సమాచారం అందించగా పోలీస్‌లు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారని కాలేజీ యాజమాన్యం చెప్పింది. పోస్ట్‌మార్టమ్ తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
- Advertisement -