సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించామని శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్‌కు లేదన్నారు. వాళ్ల హయాంలోనే ఆశా వర్కర్స్ ను గుర్రాలతో తొక్కించారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. త్వరలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, మొన్ననే ముగసిందని, కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఆయన తేల్చిచెప్పారు. మతఘర్షణల విషయంలో సీరియగా ఉన్నామని మెదక్ అల్లర్ల ఘటన వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణచివేస్తామని ఆయన స్పష్టం చేశారు.