- Advertisement -
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. వాస్తవానికి ఈనెల 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రిద్ పండుగ సందర్భంగా సెలవుపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల్లో మార్పు చోటు చేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తరువాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా ఎపి అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నియమితులు కానున్నారని, డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నా వీటిపై కూటమి నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
- Advertisement -