Tuesday, October 22, 2024

ఆరునెలలైనా..ఉద్యోగాలేవి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్ర భుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎం ఎల్‌ఎ టి. హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ని రుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నె ర వేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చె ప్పిందని, మరి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని విమర్శించారు. ఎ న్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి,రావుల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశం ని ర్వ హించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ పో స్టులు పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఇ ప్పుడు గ్రూప్ విద్యార్థులు పోస్టులు పెంచాలని కోరితే స్పందించడం లేదని పేర్కొన్నారు.

గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు కలుపుతామన్న కాంగ్రెస్ నేతలు చెప్పారని, వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు అవకాశమివ్వాలని బిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తద్వారా ఎంతో మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయమని నిరుద్యోగ అభ్యర్థులు బిఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చారని హరీశ్‌రావు తెలిపారు.

గ్రూప్స్ పరీక్షలకు మధ్య రెండు నెలల వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని అన్నారు. జులైలో డిఎస్‌సి నిర్వహిస్తున్నారని, ఆగస్టు 7,8 తేదీలలో గ్రూప్ 2 ఉందని చెప్పారు. పరీక్షల మధ్య 7 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సంగీత అనే అమ్మాయి ఆత్మహ్యత చేసుకుందని చెపారు. మెగా డిఎస్‌సి కింద 25,000ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,000ల పోస్టులతో సరిపెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రొ.కోదండరాం బాధ్యత తీసుకోవాలి
వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తమ చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగాలని కమిషన్ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారని తెలిసిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించిన ప్రొఫెసర్ కోదండరాం కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఒకరిపై ఒకరు చెప్పి పిల్లలకు అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతామని అన్నారు.

ఎపి ప్రభుత్వాన్ని చూసైనా పింఛన్లు పెంచాలి
పాలకులుగా మారిన కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యల ఊసే ఎత్తడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఏప్రిల్, మే నెలల పింఛన్లు రావడం లేదని అవ్వా తాత చెబుతున్నారని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన రూ.2 వేల పెన్షన్ కూడా నెలనెలా సరిగా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక రెండు నెలల పింఛన్ ఆగిపోయిందని చెప్పారు. అభాగ్యుల పట్ల ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు..? అని ప్రశ్నించారు. ఆసరా నుంచి వారిని ఎందుకు దూరం చేస్తున్నారని అడిగారు. తక్షణమే రెండు నెలల పెన్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికి రెండు పెన్షన్లు, మనిషికి రూ.4 వేల ఇస్తామన్నారని, ఆ ఫించన్లు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏ మూలకు పడ్డాయని ప్రశ్నించారు. పేదల పాలనలో అవ్వాతాతలు, ఒంటరి మహిళలు లేరా..? అని అడిగారు. ఎపిలో కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా పింఛన్లను 4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి సంతకం ఏమైందని నిలదీశారు. కనీసం ఎపి ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఎపి తరహాలో ఆరు నెలల బకాయిలు ఒక్కొక్కరికి రూ.12 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, ఒక్కో పెన్షన్‌దారునికి రూ.16 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సిఎంఆర్‌ఎఫ్ చెక్కులపై కెసిఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదు
ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు వైద్యవిధాన పరిషత్‌ను వస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామపంచాయతీయలకు నిధులు విడుదల చేయాలన్నారు. సిఎంఆర్‌ఎఫ్ చెక్కులపై కెసిఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని, 60 వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి ఎప్పుడూ జీతాలు ఆపలేదన్నారు.

నీట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి
నీట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయని, బిజెపి హయాంలో సంపద కొందరి చేతుల్లోకి వెళ్లినట్టే విద్య కూడా కొందరి చేతుల్లో వెళ్తోందని హరీశ్‌రావు విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి గ్రేస్ మార్కులు, పేపర్ లేకేజీ ఆందోళన కలిగిస్తున్నాయని, 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. నీట్ ఫలితాలపై ఎన్నో అనుమానాలున్నాయని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరక్కుండా బిజెపి ఎంపీలు, మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలని కోరారు. ఇంత ప్రధాన సమస్యమై వారెందుకు మాట్లాడ్డం లేదని అడిగారు.

వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధతను దెబ్బతీయకండి
సంచలనాల కోసం తనపై మీడియా,సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్‌లో ఏవో ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అయ్యానని, కాంగ్రెస్‌లోకి, బిజెపిలోకి వెళ్తున్నానని ఏవేవో చెబుతున్నారని అన్నారు. దయచేసి ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టొద్దని కోరారు. ఛానళ్ల లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయవద్దని, ఇలాంటివి మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యూట్యూబ్ ఛానెల్స్‌ను హరీశ్‌రావు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News