స్టాక్‌హోమ్: యుద్ధపు టంచుల ప్రపంచంలో తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణుపాటవాన్ని మరింత పెంచుకుంటున్నాయి. అమెరికా, రష్యా, చై నా, ఇండియా, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ , బ్రిటన్ 2023లో తమ అణ్వాయుధాలను మరింతగా ఆధునీకరించుకోవడంతో పాటు , తమ దేశ రక్షణ ధర్మంలో భాగంగా అత్యంత అధునాత అణ్వాయుధ వ్య వస్థలను సంతరించుకున్నాయని అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసర్చ్ ఇనిస్టూట్ (సిప్రి) సోమవారం వెలువరించిన తమ తాజా నివేదికలో తెలిపింది. ఒకవైపు చల్లారని రీతిలో ఉన్న సంఘర్షణలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి యుద్ధాలకు దారితీస్తున్న దశలోనే పోటాపోటీగా పలుదేశాలు అణ్వాయుధ పాటవం సంతరించుకోవడం, ఆ త్మరక్షణ పేరిట ఈ శక్తిని ఇనుమడింపచేసుకోవడం కీలక అంశమైంది.
ఈ సంస్థ విశ్లేషణ ప్రకారం అమెరికా వద్ద 5044 , తరువాతి స్థానంలో రష్యా వద్ద 5580, బ్రిటన్ వద్ద 225, ఫ్రాన్స్ వద్ద 290, చైనా వద్ద 500, భారత్ వద్ద 172, పాకిస్థాన్ వద్ద 170, ఉత్తరకొరియా వద్ద 50, ఇజ్రాయెల్ వద్ద 90 వరకూ అణ్వాస్త్రాలు ఉన్నట్లు వెల్లడైంది. గడిచిన ఏడాది చైనా అణ్వాస్త్రాల సంఖ్య ఇంతకు ముందు 410 కాగా ఇవి ఇప్పుడు 500కు చేరాయి. ఈ క్రమంలో మరింతగా చైనా తన బలం పెంచుకొంటోంది. మొత్తం మీద 2100 అణ్వాయుధ వ్యవస్థలు సర్వంసిద్ధంగా మొహరించుకుని ఉన్నాయి. వీటిలో అత్యధికం రష్యా, అమెరికాకు చెందినవే. చైనా కూడా తన అణ్వాయుధాలను ఎప్పుడంటే అప్పుడు రంగంలోకి దించడానికి సిద్దం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి లెక్కలు చూసుకుంటే దాదాపుగా 12, 121 వరకూ అణ్వాస్త్రాలు తయారు అయి ఉన్నాయి. వీటిలో దాదాపు 10వే ల వరకూ సైనిక గిడ్డంగులలో వాడకానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించా రు.
వీటిలో అనేకం మిస్సైల్స్, విమానాలకు అనుసంధానం అయి ఉన్నా యి. ఇండియా, పాకిస్థాన్, ఉత్తరకొరియాలు కూడా తమ అణ్వాయుధ సా మర్థం పెంచుకునేందుకు సాధనాసంపత్తిని సమకూర్చుకున్నాయి. ఇక పూర్తి స్థాయి వైరం నిండుకుని ఉండే దేశాలు తమ అణ్వాయుధ పాటవాలను ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేసుకుంటూ బలాబలాలను సమీక్షించుకుంటూ సాగుతూ ఉండటం ఆందోళనకర పరిణామమైంది. భారతదేశానికి సంబంధించినంత వరకూ ఇప్పటికే అత్యంత బలోపేతంగా ఉన్న చైనా పోటీని, మరో వైపు అణ్వాయుధ బలంలో తమతో సాటిగా వస్తూ ఉన్న పాకిస్థాన్‌ను ఎ్పటికప్పుడు గమనిస్తూ తన బలం పెంచుకోవల్సి వస్తోంది.