గత ప్రభుత్వం చేసిన అప్పులు, కిస్తీలకే ఏడు నెలల్లో రూ. 38,040కోట్ల
చెల్లింపు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు రూ.25,118కోట్లు
ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన పాత అప్పులు భారంగా మారాయి. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులు ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి మూలమయ్యాయి. అందులో భా గంగా ప్రతిరోజూ రూ.191 కోట్ల అప్పులు, వడ్డీలను చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురయ్యింది. 2023 డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు (199) రోజుల్లో రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న అప్పు రూ.25,118 కోట్లు కా గా, అసలు, వడ్డీలకు తిరిగి చెల్లించింది రూ.38, 040 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది.
అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిఎం రేవంత్‌రెడ్డి తనవంతు కృషిని చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు లు, వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 199 రోజుల్లో రాష్ట్ర ప్ర భుత్వం సగటున ఒక రోజుకు రూ.191 కోట్లను చెల్లిస్తోంది. దీంతోపా టు ఆరు గ్యారంటీల అమలుతో పాటు మిగతా పథకాల కోసం తెచ్చిన కొ త్త అప్పులకు వడ్డీలతో సహా కిస్తులను చెల్లిస్తూ ఆ ర్థిక పరిస్థితిని ప్రభుత్వం గాడిలో పెడుతోంది. పదేళ్లుగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్ర భుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ప్ర భుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చె ల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ ను పాటిస్తోంది.
దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణ ను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కం టే ఎక్కువ కిస్తులు చెలిచడంతో పాటు తెచ్చిన అ ప్పుల కంటే తిరిగి చెల్లింపులు ఎక్కువ చేసి ఆర్థిక క్రమశిక్షణను ప్రభుత్వం పాటిస్తోంది. గడిచిన పదేండ్లలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అ ప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, నె లసరీ చెల్లింపులు తడిసి మోపడయ్యాయి. రేవం త్ రెడ్డి సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ.25,118 కోట్లు అప్పులు చేసింది.