మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత హీరో రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్‌సి 16 చిత్రం ను చేయనున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పూర్తిగా శరీరాకృతి ను మార్చుకోనున్నారు. స్పోర్ట్ డ్రామా కావడం తో సినిమా కోసం రామ్ చరణ్ ధృఢం గా కనిపించనున్నారు.
అయితే ఈ పాత్ర మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ చిత్రం పూర్తి అయిన తర్వాత వెళ్లనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలలో ఆర్‌సి 16 షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మేకర్స్ నుండి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.