Friday, December 20, 2024

ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిల చెల్లింపు.. వివాదానికి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విద్యుత్ బిల్లు బకాయిలకు సంబంధించిన సమస్యకు తెరపడింది. ఉప్పల్ స్టేడియానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను మంగళవారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) చెల్లించింది. ఈ మేరకు హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు మొత్తం బకాయిలకు సంబంధించిన కోటి 64 లక్షల రూపాయల చెక్కును సంబంధిత విద్యుత్ అధికారులకు అందజేశారు. దీంతో దాదాపు పదేళ్లుగా ఉన్న సమస్యకు పుల్‌స్టాప్ పడింది.

జగన్‌మోహన్ రావు, హెచ్‌సిఎ కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఈ అంశానికి సానుకూల పరిష్కారం కనుగొంది. మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లించాలని హెచ్‌సిఎ పాలక వర్గం నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎండి ఫరూకిని కలిసి జగన్‌మోహన్ రావు దీనికి సంబంధించిన చెక్కున అందజేశారు. మరోవైపు ఐపిఎల్ జరుగుతున్న సమయంలో కొంత మంది అధికారులు కావాలనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసి హెచ్‌సిఎ పరువును తీశారని, దీనికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జగన్‌మోహన్ రావు సిఎండి ఫరూకిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News