Saturday, October 5, 2024

25న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు!

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఈ నెల 25న ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. కాగా, తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News