Saturday, January 18, 2025

ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

నేడు బంగ్లాదేశ్‌తో ఢీ
అంటిగువా: టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగే సూపర్8 మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ అతి కష్టం మీద ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌లతో పాటు కెప్టెన్ మిఛెల్ మార్ష్, మాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, వేడ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు.

వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. బౌలింగ్‌లోనూ కంగారూలు బలంగా ఉన్నారు. కమిన్స్, స్టార్క్, ఆడమ్ జంపా, స్టోయినిస్, హాజిల్‌వుడ్‌లతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. జంపా, కమిన్స్, హాజిల్‌వుడ్‌లు లీగ్ దశలో అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బంగ్లాదేశ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. తంజీద్ హసన్, లిటన్ దాస్, కెప్టెన్ షాంటానో, షకిబ్, తౌహిద్, మహ్మదుల్లాలతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక తస్కిన్ అహ్మన్, ముస్తఫిజుర్, తంజీమ్, షకిబ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో బంగ్లాను కూడా తక్కువ అంచనా వేయలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News