Monday, December 23, 2024

ఫోన్ చూడొద్దన్నందుకు కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ములుగు: తల్లి మందలించడంతో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. భూపతినగర్‌లో కొడ అంకిత అనే బాలిక(15) స్మార్ట్ మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తుండడంతో పలుమార్లు తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News