- Advertisement -
కరీంనగర్: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను నగర మేయర్ సునీల్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. బండి సంజయ్ కు శాలువా కప్పి మేయర్ సన్మానించారు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి దక్కడం ఆనందంగా ఉందని, కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ కృషి చేశారని సునీల్ రావు కొనియాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పూర్తిలో బండి సంజయ్ సహకారం మరువలేనిదన్నారు.
- Advertisement -