Friday, December 20, 2024

భారత్ సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

బార్బడోస్: టి20 ప్రపంచకప్ సూపర్8లో టీమిండియా బోణీ కొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20) పరుగులు చేశారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

చెలరేగి ఆడిన సూర్యకుమార్ 28 బంతుల్లోనే 3 సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 24 బంతుల్లో 32 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. భారత బౌలర్లలో బుమ్రా ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు.అర్ష్‌దీప్‌కు కూడా మూడు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News