తెలుగు చలన చిత్రసీమలో విలక్షణమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు దర్శకుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. వైవిధ్యభరిత కాన్సెప్ట్ తెరకెక్కించడంలో ఆయన స్టైలే వేరు. ఒకవైపు ‘నచ్చావులే’, ‘మనసారా` వంటి ఆహ్లాదకరమైన చిత్రాలు తెరకెక్కించారు. మరోవైపు ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2` వంటి హారర్, థ్రిల్లర్ చిత్రాలతోనూ ప్రేక్షకులను థ్రిల్ చేశారు.
తాజాగా రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన చిత్రం ‘రష్’. సతీశ్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో, యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్`లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక సాధారణ గృహిణికి కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రవిబాబు డిస్కస్ చేసిన సోషల్ ఇష్యూ కూడా ప్రేక్షకులని తప్పక ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవి విన్‌లో అద్భుతమైన ప్రేక్షకాధరణతో దూసుకుపోతుంది. ఇటీవలి కాలంలో పర్‌ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమాల జాబితాలో ఈ సినిమా చేరడంతో పాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి రష్ తప్పక ఒక మంచి ఛాయిస్. ఇంకా చూడని వారెవరైనా ఉంటే వెంటనే ఈటీవి విన్ లో ఈ సినిమా తప్పక చూసేయండి.