Monday, November 25, 2024

సరికొత్త రికార్డు స్థాయిని తాకి చివరికి నష్టాల్లోకి నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం సరికొత్త రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఐటి స్టాకుల్లో కొనుగోలు ఒత్తిడి, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడంతో మార్కెట్ సూచీలు పెరిగాయి.

సెన్సెక్స్ 30 కంపెనీలలో టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్ సిఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వీస్, పవర్ గ్రిడ్ , ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడగా, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి.

విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్ఐఐలు) రూ. 415.30 కోట్ల ఈక్విటీలను గురువారం కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ దశను కొనసాగించొచ్చని తెలుస్తోంది. మార్కెట్ బుల్లిష్ గానే ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్ కుమార్ తెలిపారు.

ఇది రాసే వేళకు సెన్సెక్స్ 76830. నిఫ్టీ 23416 వద్ద నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News