Thursday, December 19, 2024

యథావిధిగా వేలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వేదికగా శుక్రవారం బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శా ఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి సంబంధించి పలు అంశాలను దృష్టికి తీసుకెళ్లారు. పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రి య ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలం పాటను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పా టు సింగరేణి సిఎండి కూడా హాజరయ్యారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలానికి ఉంచింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క సింగరేణి గనులకు సంబంధించి పలు అంశాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని భట్టి కోరారు. గనులు కేటాయించకపోతే భవిష్యత్తు లో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. సింగరేణికి వేలంలో రి జర్వేషన్ కల్పించాలని కోరారు. సింగరేణికి కేంద్రం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థ కొంగు బంగారం వం టిదన్న భట్టి 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వేలం పెట్టిన శ్రావణప ల్లి గనిని సింగరేణికే ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి వేలంలో రిజర్వేషన్లను కల్పించే విధంగా చొరవ చూపాలని భట్టి కోరారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో మాట్లాడుతామని, ఇందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు.

అఖిలపక్షంగా వచ్చి సింగరేణి సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్‌ల పాత లీజు రద్దు చేయాలని, వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందని విమర్శించారు. ఈ వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవెనెత్తిన పలు అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒడిశా నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణికి లాభం చెందే విధంగా చేస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామన్న ఆయన కొత్త బొగ్గు గనుల వేలాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతోనే చేస్తున్నామని స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికులకు కేంద్రం అన్యాయం చేయదన్నారు. తాజాగా జరుగుతున్న పదో వేలంలో మొత్తం 60 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీసగఢ్‌కు చెందిన 15, జార్ఖండ్ – 6, బిహార్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ఒక శ్రావణపల్లి మాత్రమే జాబితాలో ఉంది. ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ బ్లాకును దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొన్నది. ఈ బ్లాక్ ను సింగరేణికే ఇవ్వాలని భట్టి కోరిన నేపథ్యంలో ఈ బ్లాక్ ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజారనీయవద్దని దక్కపోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇక గనుల వేలంపై బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. గనులను వేలం వేసి సింగరేణి మూతపడేయాలన్న కుట్ర జరుగుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వేలంలో ప్రైవేటు కంపెనీలు కూడా పాల్గొనవద్దని కోరారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పిన కేటీఆర్ ఈ నిర్ణయాలను సమీక్షిస్తామని హెచ్చరించారు. కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధాన్యతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో సింగరేణిని కేంద్రం ఆదుకేనేలా ప్రణాళికలు చేస్తామన్నారు. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయని, ఒడిస్సా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే పాలసీని కేంద్రం అమలుచేస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ధి : కిషన్‌రెడ్డి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ధి ఉంటుందని, ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామన్న కేంద్రమంత్రి ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్లు తెలిపారు. ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని వివరణ ఇచ్చారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భటి ్టవిక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. సింగరేణి విషయంలో పార్టీలు రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆక్షన్ అనేది ఓపెన్..సింగరేణి మాత్రమే కాదు..ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని కిషన్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు.

సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్ లు కేటాయించాలి : భట్టి

సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటి సారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని అన్న భట్టి విక్రమార్క మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసన్నారు. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయన్నారు. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్ లు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తీయడానికి అవకాశం ఇంకా ఉందని తెలిపారు.

2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయిందని తెలిపారు. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. సింగరేణి ప్రభుత్వ సంస్థకు కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్ కు వెళ్లాయన్నారు. రిజర్వేషన్లు పక్కన పెట్టి ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం వాటిల్లిందన్నారు. ఇదే విధంగా కొన్సాగితే 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కోటా లో బొగ్గు బ్లాక్ లు కేటాయించే అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News