Saturday, October 5, 2024

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో గోపిచంద్ మూవీ షురూ

- Advertisement -
- Advertisement -

యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్, డైనమిక్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజా ‘ఎస్‌డిజిఎం’ ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయింది. శనివారం అధికారికంగా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘ఎస్‌డిజిఎం’ రూపొందుతోంది. మూవీలోని కీలకంగా వుండే కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం ద్వారా మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించింది. సన్నీ డియోల్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడంలో పాపులర్. బలమైన భావోద్వేగ కథనాలతో ఇంటెన్స్ యాక్షన్‌ను అద్భుతంగా చూపించగల డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఆయన జట్టు కట్టారు.

ఈ కాంబినేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది. లార్జర్ దెన్ లైఫ్‌గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు మొదటి నుండి చివరి వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నాయి. సయామి ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నాయి. సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News