Monday, December 23, 2024

తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. కల్కి టికెట్ ధరలు భారీగా పెంపు

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత క్రేజీ ప్రాజెక్టు కల్కి. ఈ మూవీ జూన్ 27న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇక, ఈ మూవీ టికెట్ ధరలు భారీగా పెంచినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతించింది. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. విడుదల రోజు జూన్ 27న ఉదయం 5.30 షోకు న తెలంగాణ సర్కార్ ఒకే చెప్పినట్లు సమాచారం.

పాన్ వరల్డ్ స్థాయిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విడుదల కోసం అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News