మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ ను విధించారు. మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ తోపాటు పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు. అలాగే 144 సెక్షన్ ని అమలు చేశారు. ఆ ప్రాంతంలో గుంపులుగా ఎవరు తిరిగిన వారిపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు.
ఈ పరిసర ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో ఇంటి జాగా ఇస్తున్నారని పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారని.. ఇలాంటి చర్యలు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై కఠమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.