Saturday, December 21, 2024

లైంగిక దాడి కేసులో సూరజ్ రేవన్న అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పార్టీలోని 27 ఏళ్ల కార్యకర్తపై లైంగికంగా దాడిచేసినందుకు కర్నాటక పోలీసులు ఆదివారం జెడి(ఎస్) ఎంఎల్సీ సూరజ్ రేవన్న అరెస్టు చేశారు. సూరజ్ రేవన్న ఇటీవల అనేక మంది మహిళలపై లైంగిక దాడి చేసిన కేసుల్లో అరెస్టయిన ప్రజ్వల్ రేవన్నకు స్వయాన అన్న.

సాటి మగవాడని కూడా చూడకుండా పార్టీలోని కార్యకర్త శివకుమార్ మీద లైంగిక దాడి చేసినందుకు ఐపిసి సెక్షన్ 377 కింద కేసు పెట్టారు. ఇంకా 342,506,34 సెక్షన్ల కింద కూడా సూరజ్ రేవన్న మీద పోలీసులు కేసుపెట్టారు.

కేసు ఫైల్ చేయడానికి ముందు బాధితుడు కర్నాటక హోం మంత్రి గంగాధరయ్య పరమేశ్వరను, రాష్ట్ర పోలీస్ చీఫ్ ను కలుసుకున్నాడు. నిందితుడి వైద్య పరీక్ష చేశామని, త్వరలో సూరజ్ కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News