Monday, December 23, 2024

హజ్ యాత్రలో తీవ్రమైన వేడికి వందలాది మంది మృతి

- Advertisement -
- Advertisement -

సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఈ ఏడాది వివిధ దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చినప్పటికీ తీవ్రమైన అత్యధిక వేడికి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు.22 దేశాల నుంచి పది లక్షలకు పైగా యాత్రికులు రాగా, సౌదీ అరేబియా పౌరులు 2,22, 000 మంది యాత్రలో పాల్గొన్నారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చారు. అయితే అత్యధిక వేడికి
తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబీకులు వారి మృతదేహాల కోసం బుధవారం ప్రయత్నించడం కనిపించిందని అధికారులు తెలిపారు. ఫలానా కారణాల వల్ల మరణాలు సంభవించాయని సౌదీ అరేబియా పాలక వర్గాలు చెప్పడం లేదు. జాడ తెలియని వారి సమాచారం తెలుసుకోడానికి కోసం మక్కా సమీపాన అల్‌ముయైసెమ్ లోని ఎమర్జెన్సీ కాంప్లెక్సులో వందలాది మంది క్యూలో నిలుచోవడం జరుగుతోంది. మక్కా లోని మెడికల్ కాంప్లెక్సులో మృతుల జాబితా ఒక అధికారి చదువుతున్నప్పుడు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. చనిపోయిన వారి సంబంధీకులనే కాంప్లెక్సు లోపలికి పంపించారు. మృతుల్లో అల్జీరియా, ఈజిప్టు, భారత దేశాలకు చెందిన వారున్నారు.

ఐదు రోజుల హజ్‌యాత్రలో 550 మంది చనిపోయారని ఆన్‌లైన్‌లో ఒక జాబితా వెలువడింది. అయితే కనీసం 600 మందైనా చనిపోయి ఉంటారని వైద్యుడుతోపాటు అధికారి ఒకరు అంచనాగా చెప్పారు. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015 లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్‌యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్‌వేవ్‌తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోవడం విశేషం. మంగళవారం మక్కాలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ (117 డిగ్రీల ఫారన్‌హీట్) కు చేరుకున్నాయి. మక్కా చుట్టుపక్కల ఉన్న పవిత్ర స్థలాల్లోనూ ఇదే పరిస్థితి. కొంతమంది సైతాన్‌ను తరిమికొట్టడానికి ఆనవాయితీగా రాళ్లను విసిరేటప్పుడు స్పృహ తప్పి పడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News