Thursday, December 19, 2024

ఓఆర్‌ఆర్‌పై బస్సు బోల్తా..ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందగా, పది మందికిపైగా గాయపడ్డారు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివా రం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణికులతో సాయంత్రం బయల్దేరింది. బస్సు నార్సింగి సమీపంలోని ఒ ఆర్‌ఆర్ వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో బస్సు చక్రా ల కింద పడి ఇద్దరు మృతి మరో పది మంది గాయపడ్డారు. గమనించిన వాహనదారులు వెంటనే గాయపడిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నా ర్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును పక్కకు తప్పించారు. ఈ ఘటనపై కే సు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News