Monday, December 23, 2024

మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రేవు….

- Advertisement -
- Advertisement -

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు.

హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రేవు’ సినిమా త్వర లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏ ర్పాటు చేసిన కార్య్రకమంలో మురళీ మోహ న్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘మత్స్యకారుల జీవితాలు, వారి జీవితాల్లో జరిగే సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించారు. రేవు నేపథ్యంలో సాగే ఈ సినిమా ఘన విజయం సాధించాలి’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News