ఛండీగఢ్: ఓ వ్యక్తి తన తల్లి, కూతురును తుపాకీతో కాల్చి చంపి అనంతరం పెంపుడు కుక్కను కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అకాలీదళ్ నేత కుల్వీర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రమణ్‌దీప్, తల్లితో కలిసి ఉంటున్నాడు. కుల్వీర్ కుమార్తె నిమ్రత్ కౌర్ వారం రోజుల క్రితం కెనడా నుండి ఇండియాకు వచ్చింది. రమణ్‌దీప్ బయటకు వెళ్లిన సమయంలో తల్లి, కూతురు, కుక్కను కుల్వీర్‌సింగ్ తన తుపాకీతో కాల్చి చంపిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. డిఎస్‌పి సత్వీర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుల్వీర్‌సింగ్ గత కొంత కాలంగా మానసికంగా కుంగుబాటుతో ఉన్నాడు. మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకుంటున్నాడని అతడి భార్య తెలిపింది. పోలీసులు రివాల్వర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి, కూతురు, పెంపుడు కుక్కను తుపాకీతో కాల్చి… ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -